News March 26, 2026

EVM, VVప్యాట్ల గోదాముల్లో కలెక్టర్ పరిశీలన

image

EVM, VVప్యాట్ల గోదాముకు ప‌టిష్ట భద్రత కల్పించినప్పటికి నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌ను కలెక్టర్ లక్ష్మీశ అదేశించారు. గురువారం గొల్లపూడిలోని EVM, VVప్యాట్ల గోదామును పరిశీలించారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు.

Similar News

News April 8, 2026

ఆదిలాబాద్: నిధుల కోసం ‘స్నేహ’ హస్తం

image

సీఎం సభలో విపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ పురోగతి కోసం విభేదాలు పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా విపక్ష నేతలు స్పష్టం చేయడం గమనార్హం.
మొండిగా వెళ్లకుండా అభివృద్ధి విషయంలో సానుకూలంగా స్పందించడం పట్ల సీఎం సైతం హర్షం వ్యక్తం చేశారు.

News April 8, 2026

HNK: బాలికపై లైంగిక వేధింపులు.. ఇద్దరికి జైలు

image

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. HNK జిల్లా కమలాపూర్ మండలానికి చెందిన పస్తం అరవింద్, తూర్పాటి రాజుకు జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి కమ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

News April 8, 2026

నెల్లూరు హోటళ్లలో తింటున్నారా?

image

నెల్లూరులో కొన్ని హోటళ్ల తీరు దారుణంగా ఉంటుంది. ఆహారంలో రంగులు కలుపుతున్నారు. ఊరూ పేరు లేని కల్తీ వస్తువులతోనే వంటలు చేస్తున్నారు. నిషేధిత రంగులతో వంటలు చేస్తున్న 18హోటళ్లను గుర్తించగా.. వాటిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జేసీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. తనిఖీల్లో దొరికిన ఐదుగురు వ్యాపారులకు రూ.1.25 లక్షల జరిమానా వేశారు. ఫుడ్ క్వాలిటీలో రూల్స్ అతిక్రమిస్తే రూ.10లక్షల వరకు ఫైన్ ఉంటుందని హెచ్చరించారు.