News June 17, 2024

ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివి: రాహుల్ గాంధీ

image

భారత్‌లో ఈవీఎంలు ‘బ్లాక్ బాక్స్’లాంటివని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈవీఎంలు రద్దు చేయాలన్న <<13448138>>మస్క్<<>> వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. వీటిని పరిశీలించేందుకు ఎవ్వరికీ అనుమతి ఉండదన్నారు. దీంతో దేశంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర ఆందోళనలు తలెత్తుతున్నాయని చెప్పారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యంలో మోసాలు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

image

<>IIT <<>>హైదరాబాద్‌లో 2 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: iith.ac.in

News November 22, 2025

కివీతో ఎన్నో లాభాలు

image

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.

News November 22, 2025

మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

image

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.