News June 19, 2024
ఈవీఎంలు పోవాల్సిందే.. బ్యాలెట్ రావాల్సిందే: డీకే శివకుమార్

ఈవీఎంల పనితీరుపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో BJP- JDS కూటమి అత్యధిక సీట్లు గెలవడానికి EVMలే కారణమని ఆరోపించారు. EVMలను తీసేసి.. మళ్లీ పోస్టల్ బ్యాలెట్ విధానం తేవాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకు గాను BJP 29 చోట్ల గెలవడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు. కాగా కర్ణాటకలో బీజేపీ 17, జేడీఎస్ 2, కాంగ్రెస్ 11 చోట్ల నెగ్గాయి.
Similar News
News September 15, 2025
చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.
News September 15, 2025
నవంబర్‌లో టెట్: కోన శశిధర్

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్‌లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.
News September 15, 2025
భారత్ విక్టరీ.. ముఖం చాటేసిన పాక్ కెప్టెన్

భారత్ చేతిలో ఘోర ఓటమో, షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదనో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడకుండా ముఖం చాటేశారు. పీసీబీ ఆదేశాలతోనే ఆయన ఈ సెర్మనీకి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. సంప్రదాయం ప్రకారం మ్యాచ్ ముగిసిన వెంటనే ఓడిన జట్టు కెప్టెన్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడతారు. మరోవైపు షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా భారత్ క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించిందని పాక్ ACAకు ఫిర్యాదు చేసింది.