News November 23, 2024
ఈవీఎంలు ట్యాంపర్ చేశారు: సంజయ్ రౌత్

మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మోదీ, షా, అదానీ ఈ కుట్రలో భాగస్వాములని కాసేపటి క్రితం ప్రెస్‌మీట్‌లో ఆరోపణలు గుప్పించారు. ప్రస్తుత ఫలితాలు ప్రజా విజయంగా పరిగణించవద్దన్నారు. తాము ఈ ఓటమిని అంగీకరించమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 23, 2025
మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.
News October 23, 2025
కోహ్లీ గెస్చర్ దేనికి సంకేతం?

AUSతో రెండో వన్డేలో డకౌటై వెళ్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఫ్యాన్స్‌కు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. అయితే దీనిపై SMలో చర్చ జరుగుతోంది. రన్ మెషీన్ అడిలైడ్‌లో చివరి మ్యాచ్ ఆడేశారని, అందుకే ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు సిరీస్ తర్వాత రిటైర్ కానున్నారని, అదే హింట్ ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలోనూ కోహ్లీ ‘0’కే ఔటయ్యారు.
News October 23, 2025
ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.