News May 26, 2024
అన్ని మెడికల్ కాలేజీల్లో EWS కోటా సరికాదు: ఈశ్వరయ్య

TG: రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో 10 శాతం EWS కోటా ఇవ్వాలన్న ప్రభుత్వ <<13311657>>నిర్ణయం<<>> ఆమోదయోగ్యం కాదని మాజీ సీజే, NCBC మాజీ ఛైర్మన్ ఈశ్వరయ్య అన్నారు. దీనివల్ల ఓపెన్ కేటగిరీ సీట్లు తగ్గడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 350 సీట్లు నష్టపోతారని తెలిపారు. గతంలో 10 శాతం సూపర్ న్యూమరరీ కోటాను ఇచ్చి, అందులో EWS అమలు చేశారన్నారు. ఇప్పుడు మంజూరైన సీట్లలోనే ఆ కోటా ఇవ్వడం సరికాదని చెప్పారు.
Similar News
News September 14, 2025
OG మూవీలో నేహాశెట్టి సర్ప్రైజ్

పవన్ కళ్యాణ్ ‘OG’మూవీపై హైప్ అంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉందని క్లారిటీ వచ్చింది. DJ టిల్లు మూవీ ఫేమ్ నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని స్వయంగా హీరోయినే కన్ఫమ్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ‘OG’లో సర్ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా.. పవన్తో కీలక సన్నివేశాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది.
News September 14, 2025
నేడు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు

AP: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం, అనుబంధంగా ద్రోణి విస్తరించిందని APSDMA తెలిపింది. దాని ప్రభావంతో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని చెప్పింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
News September 14, 2025
రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం: చంద్రబాబు

AP: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.5% వృద్ధి సాధించినట్లు CM చంద్రబాబు వెల్లడించారు. ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్పై మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమన్నారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్ను విశ్లేషిస్తున్నామన్నారు. 2029నాటికి రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యంగా పనిచేయాలన్నారు.