News March 28, 2024
మాజీ సీఎం కొడుకు ఆస్తులు రూ.700 కోట్లు.. సొంత కారు లేదట!

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ కొడుకు నకుల్ నాథ్ ఇటీవల ఛింద్వాడా నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తులను రూ.700 కోట్లుగా చూపించిన ఆయన.. సొంత కారు లేదని పేర్కొనడం గమనార్హం. గత ఐదేళ్లలో తన ఆస్తులు సుమారు రూ.40 కోట్లు పెరిగినట్లు వివరించారు. భార్య వద్ద కేవలం రూ.43వేల నగదు మాత్రమే ఉందని, తన తండ్రి కమల్‌నాథ్‌కు రూ.12లక్షల లోన్ ఇచ్చినట్లు వెల్లడించారు.
Similar News
News December 10, 2025
పల్నాడు కలెక్టర్‌కు 5వ ర్యాంకు

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృతికా శుక్లా అతి తక్కువ కాలంలోనే మంచిపేరు సంపాదించారు. వివిధ శాఖల ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆమె 110 ఫైల్స్ స్వీకరించారు. అందులో 73 క్లియర్ చేశారు. సగటున ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి ఒక రోజు 3గంటల సమయం తీసుకున్నారు. దీంతో ఫైల్స్ క్లియరెన్స్‌లో కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు 5వ ర్యాంకు ఇచ్చారు.
News December 10, 2025
చీకటి గదిలో ఫోన్ చూస్తున్నారా?

చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం అలవాటు. అలా చూడటం కళ్లకు మంచిది కాదని తెలిసినా ‘తప్పదు’ అని లైట్ తీసుకుంటారు. అయితే ఆ ‘లైట్’ ముఖ్యం అంటున్నారు వైద్యులు. గదిలోని అన్ని లైట్లు ఆర్పేసి చీకట్లో ఫోన్ చూడటం వల్ల దాని కాంతి నేరుగా కళ్లపై పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రివేళ ఫోన్ చూసినప్పుడు తప్పనిసరిగా గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
News December 10, 2025
వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్‌మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.


