News October 10, 2024

రతన్ టాటా మృతిపై మాజీ ప్రేయసి ట్వీట్

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరెవాల్ సంతాపం తెలిపారు. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లిష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, బెంగాలీలో పలు చిత్రాల్లో నటించారు.

Similar News

News October 21, 2025

NCLTలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో లా రీసెర్చ్ అసోసియేట్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB/LLM, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.60వేలు (ఢిల్లీలో రూ.80వేలు). వెబ్‌సైట్: https://nclt.gov.in/

News October 21, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.2,080 పెరిగి ₹1,32,770కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,21,700గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ.2000 తగ్గి, ప్రస్తుతం రూ.1,88,000 పలుకుతోంది. కాగా 6 రోజుల్లో వెండి ధర రూ.18వేలు తగ్గడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 21, 2025

విడాకులకు దారితీసే 4 కారణాలివే: నిపుణులు

image

వైవాహిక జీవితంలో విడాకులకు దారితీసే 4 ప్రధాన అంశాలపై మానసిక నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అవే.. సమర్థించుకోవడం, విమర్శించడం, ధిక్కారం, చెప్పింది వినకపోవడం. ‘ఈ లక్షణాలు భాగస్వాముల మధ్య దూరాన్ని పెంచి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ నాలుగు అంశాలను నియంత్రించకపోతే వివాహ రథం విడాకులవైపు వేగంగా పయనించడం ఖాయం’ అని నిపుణులు సూచిస్తున్నారు. సామరస్యం కోసం వాటిని దూరం పెట్టాలి. Share it