News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 1, 2025

ఇంగ్లండ్‌కు నిరాశ.. సౌతాఫ్రికా విజయం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచులో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని 29.1 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో డస్సెన్ (72), క్లాసన్ (64) రాణించారు. ఇప్పటికే సౌతాఫ్రికాకు సెమీస్ బెర్తు ఖరారు కాగా, ఇంగ్లండ్ ఒక్క విజయం కూడా లేకుండానే నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

News March 1, 2025

ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్

image

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

సంక్రాంతికి వస్తున్నాం OTTలో చిన్న ట్విస్ట్!

image

ఇవాళ OTTలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రన్ టైమ్ తగ్గింది. థియేటర్‌లో 2గం. 24ని.లు స్క్రీన్ అయిన ఈ సినిమా జీ5లో 2గం. 16 ని.లే అందుబాటులో ఉంది. రన్ టైమ్ కారణంగా థియేటర్ వెర్షన్‌లో కట్ చేసిన కొన్ని సీన్లను OTTలో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కొసరు మాట పక్కనబెడితే అసలుకే కత్తెరేశారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!