News June 17, 2024
వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా

AP: మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్ధా ప్రకటించారు. 2014లో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన శిద్ధా.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
Similar News
News October 14, 2025
మచాడోకు నోబెల్.. నార్వేలో వెనిజులా ఎంబసీ క్లోజ్

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి రావడాన్ని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో జీర్ణించుకోలేకపోతున్నారు. నార్వేపై ప్రతీకార చర్యలకు దిగారు. అక్కడ తమ ఎంబసీని మూసివేయించారు. ఇందుకు అంతర్గత సర్దుబాటే కారణమని చెప్పారు. మడురో ప్రభుత్వం, ప్రతిపక్షాల వివాదానికి నార్వేనే మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈక్రమంలోనే మచాడోకు నోబెల్ ప్రకటించడం మడురో ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది.
News October 14, 2025
WIపై భారత్ ‘సిరీస్ క్లీన్ స్వీప్’.. Highlights

* ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(2వ టెస్టు), జడేజా(ఫస్ట్ టెస్ట్)
* ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: జడేజా
* ప్రత్యర్థిపై వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్ విజయాలు: వెస్డిండీస్‌పై భారత్(10) (2002-25)
* ఇండియాలో వరుసగా ఓడిన జట్లలో రెండో స్థానంలో WI(6). ఫస్ట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా(7)
* కెప్టెన్‌గా గిల్‌కిది తొలి టెస్ట్ సిరీస్ విజయం
News October 14, 2025
పుట్టినప్పుడు 306.. పెరిగాక 206 ఎముకలు!

శిశువులు సుమారు 306 ఎముకలతో <<18001798>>పుడితే<<>> యుక్తవయస్సు వచ్చేసరికి అవి 206కి తగ్గుతాయి. మిగిలిన 100 ఎముకలు ఏమయ్యాయనే సందేహం మీకు వచ్చిందా? శిశువులకు మెదడు పెరుగుదల కోసం, ప్రసవ సమయంలో సులభంగా బయటకు వచ్చేందుకు వీలుగా పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. పిల్లలు పెరిగేకొద్దీ ఈ చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు గట్టిపడి ఒకే పెద్ద ఎముకగా ఏర్పడతాయి. పుర్రె ఎముకలు, వెన్నెముక & కటి ఎముకలు కలిసిపోతాయి.