News June 25, 2024
మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో చుక్కెదురు

AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్కు పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. విచారణను 2వారాలకు వాయిదా వేసింది.
Similar News
News October 17, 2025
అది కల్తీ మద్యమే: ల్యాబ్ నివేదిక

AP: NTR(D) ఇబ్రహీంపట్నంలో జనార్దన్రావు విక్రయించిన మద్యం కల్తీదే అని తేలింది. అది అత్యంత ప్రమాదకరమైంది కాకపోయినా నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రమాణాలు లేవని ల్యాబ్ రిపోర్ట్స్ తేల్చాయి. 25గా ఉండాల్సిన UP(అండర్ ప్రూఫ్) 35గా, అలాగే 75గా ఉండాల్సిన OP(ఓవర్ ప్రూఫ్)65గా ఉన్నట్లు గుర్తించాయి. మద్యం తయారీలో నాణ్యత, గాఢతలను UP, OP తెలియజేస్తాయి. ఈ కేసులో ఇప్పటికే జనార్దన్రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
News October 17, 2025
దీపావళి బోనస్.. నేడే అకౌంట్లలో రూ.లక్ష జమ

తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఇవాళ దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR) కింద బొగ్గు సంస్థలు ఒక్కో కార్మికుడికి రూ.1.03 లక్షల చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నాయి. ఇప్పటికే ఈనెలలో దసరా సందర్భంగా రూ.1.95 లక్షల చొప్పున కార్మికులకు ప్రభుత్వం కానుక ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ దీపావళి బోనస్ రానుండటంతో వారి ఆనందం రెట్టింపు కానుంది.
News October 17, 2025
చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

చర్మంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.