News June 16, 2024
పరీక్ష తేదీలు ప్రకటించిన TGPSC

TG: గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2, వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ సహా పలు ఉద్యోగాల పరీక్ష తేదీలను TGPSC ఖరారు చేసింది. జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. పరీక్షల షెడ్యూల్ను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు. CBRT విధానంలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు 3 రోజుల ముందు నుంచి హాల్టికెట్లు పొందవచ్చు.
Similar News
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.
News November 26, 2025
న్యూస్ అప్డేట్స్ @4PM

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ


