News August 25, 2024

VRO, VRAలకు పరీక్ష?

image

TG: 10,954 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో VRO, VRAలుగా పనిచేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటర్/డిగ్రీ అర్హత ఉన్న వారికి ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చి, కొత్త వ్యవస్థలో స్థానం కల్పించనుంది. ఇలా భర్తీ కాగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రెవెన్యూ వర్గాల సమాచారం.

Similar News

News March 6, 2026

కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

image

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.

News March 6, 2026

కేజీ వెండిపై రూ.5వేలు తగ్గుదల

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో <<19309772>>బంగారం<<>>తో పాటు ఇవాళ వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.5వేలు తగ్గి రూ.2,90,000 పలుకుతోంది. గత 6 రోజుల్లో కేజీ వెండిపై రూ.35వేలు తగ్గుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 6, 2026

తనూజ, దివ్వెల మాధురిపై పోలీసులకు ఫిర్యాదు

image

AP: తిరుమలలో <<19305826>>దివ్వెల మాధురి<<>>, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరుపుకున్నందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి వేడుకలు నిషేధమని వెల్లడించింది. వీడియోలు తీసి SMలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ఇక ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.