News September 14, 2024
ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!

అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.
Similar News
News November 22, 2025
అయిజ: రైతులను ప్రోత్సహించేందుకే సంబరాలు

రైతులను వ్యవసాయపరంగా ప్రోత్సహించేందుకు రైతు సంబరాలు నిర్వహిస్తున్నట్లు అయిజ సింగల్ విండో మాజీ ఛైర్మన్ సంకాపూర్ రాముడు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లిలో వెలసిన వరాహ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆలయ ప్రాంగణంలో అంతర్రాష్ట్ర న్యూ కేటగిరి విభాగం బండలాగు పోటీలు ప్రారంభించారు. వ్యవసాయంలో ప్రధానమైన ఎడ్ల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News November 22, 2025
నట్స్తో బెనిఫిట్స్: వైద్యులు

నిత్యం స్నాక్స్గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
News November 22, 2025
రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్ ఫ్రీజర్ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.


