News January 24, 2025
కొత్తగూడెం, సాగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

TG: కొత్తగూడెం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట, రామవరం ప్రాంతాల్లో 950 ఎకరాలు, సాగర్ సమీపంలోని ఏపీ వైపు విజయపురి సౌత్ వద్ద 1600 ఎకరాల భూములను చెక్ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
Similar News
News December 28, 2025
CAT: 99 పర్సెంటైల్ వచ్చినా సీటు కష్టమే!

IIMలలో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రవేశ పరీక్ష CATలో అసాధారణ ప్రతిభ కనబర్చాలి. కానీ ఇటీవల CATలో టాపర్లు పెరిగిపోతుండటంతో 99% పైగా పర్సెంటైల్ వచ్చినా సీట్లు రావడం లేదు. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం, టాపర్లు ఎక్కువగా ఉండటమే కారణం. CAT 2025లో 12 మందికి 100% మార్కులు, 26 మందికి 99.99, 26 మందికి 99.98% మార్కులు వచ్చాయి. ఒకప్పుడు 99.30% వస్తే సీటు దక్కేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడం గమనార్హం.
News December 28, 2025
ధనుర్మాసం: పదమూడో రోజు కీర్తన

‘శుక్రుడు ఉదయించి, బృహస్పతి అస్తమించాడు. పక్షులు కిలకిలరావాలతో ఆకాశంలోకి ఎగిశాయి. తెల్లవారింది లెమ్ము. బకాసురుని సంహరించిన కృష్ణుడిని, రావణుని అంతం చేసిన రాముడిని కీర్తిస్తూ, వారిని సేవించుకోవడానికి ఇది మంచి సమయం. వికసించిన తామర కన్నులు గల ఓ సుందరీ! నీ కపట నిద్ర వీడి, మాతో కలిసి పవిత్ర స్నానమాడి వ్రతంలో పాల్గొను. నీ రాకతో మనందరికీ శుభం కలుగుతుంది’’ అని గోపికలు ప్రార్థిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 28, 2025
వాళ్లకు దేశం కన్నా మతమే ఎక్కువ: అస్సాం CM

బంగ్లాదేశీయులకు దేశం కన్నా మతమే ఎక్కువని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘ఇప్పుడు బంగ్లాదేశ్‌లో <<18624742>>దీపూ చంద్రదాస్<<>> పరిస్థితి చూస్తున్నాం. 20 ఏళ్ల తర్వాత అస్సాంలో ఇలానే జరిగే ప్రమాదం ఉంది. 2027 నాటికి అస్సాంలో బంగ్లా సంతతికి చెందిన మియా ముస్లింలు 40% ఉంటారు’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ‘నాగరికత పోరాటం’గా హిమంత అభివర్ణించారు.


