News February 3, 2025
EXAMS: వికారాబాద్లో 38 కేంద్రాలు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News November 24, 2025
IIT ధన్బాద్ 105 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 24, 2025
జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జీవో నం.46 ప్రకారం 50% క్యాప్తో రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో SC, STల పంచాయతీలు యథాతథంగా ఉండగా 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల BCల రిజర్వు స్థానాలు మారాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సైతం ఈ వివరాలు పంపింది.
News November 24, 2025
సచివాలయంలో బ్లాక్ షీప్స్..

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం కొందరు సీనియర్ ఐఏఎస్లు BRSకు ముఖ్య సమాచారం లీక్ చేస్తున్నారనే ఆరోపణలు. రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు, డ్రాఫ్ట్ దశలోని రిపోర్టుల్లోని కీలక అంశాలను పాత ప్రభుత్వ ముఖ్య నేతలకు చేరవేస్తున్నారట. దీంతో ఆ బ్లాక్ షీప్స్ ఎవరో తెలుసుకునే పనిలో ఇంటలిజెన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.


