News January 5, 2025
జనవరి 15న పరీక్షలు రద్దు

TG: ఈ నెల 15న కనుమ పండుగ రోజున జరగాల్సిన ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలను JNTU రద్దు చేసింది. పండుగ రోజున పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 15న జరగాల్సిన పరీక్షను రద్దు చేస్తూ, 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 18, 2025
భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.

CCRHలో 90 పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH ) 90 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.