News August 3, 2024
ఒక్క ఇల్లు తప్ప.. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది!

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్ తీవ్ర విపత్తును సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిపడిన వరదలో సామేజ్ అనే గ్రామంలో ఒక ఇల్లు తప్ప మొత్తం కొట్టుకుపోయింది. తాము ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని ఆ కుటుంబీకులు పంచుకున్నారు. ‘వరద తర్వాత బయట చూస్తే మా ఇల్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. వెంటనే సమీపంలోని కాళీమాత ఆలయానికి పరిగెత్తి తలదాచుకున్నాం’ అని పేర్కొన్నారు. ఈ విలయంలో 53మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
Similar News
News March 26, 2026
IPL: RCB-SRH మ్యాచ్ జరుగుతుందా?

ఎల్లుండి సాయంత్రం IPLలో RCB-SRH ప్రారంభ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియం మాత్రం ఇంకా రెడీ కాలేదు. గతేడాది తొక్కిసలాట తర్వాత రెనోవేషన్ పనులు చేపట్టగా తొలి మ్యాచ్ రోజు నాటికి పూర్తవుతుందా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి స్టేడియం పనుల పూర్తికి ఈ నెల 15 డెడ్‌లైన్ కాగా పనులన్నీ ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. మరో 48 గంటల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
News March 26, 2026
రేపు జాగ్రత్త: APSDMA

AP: రాష్ట్రంలో రేపు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మన్యం (D) గుమ్మలక్ష్మీపురం, కురుపాం, అల్లూరి(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ(D) జగ్గంపేట, తూ.గో.(D) కోరుకొండ, ఎన్టీఆర్(D) జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యవసరమైతేనే బయటకు రావాలంది. మంచి నీరు, మజ్జిగ, ORS ఎక్కువగా తాగాలని సూచించింది.
News March 26, 2026
కొత్తగా 620 డ్రైవింగ్ స్కూళ్లతో కోటి ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ

దేశంలోని 120 జిల్లాలు, 500 బ్లాకు(జిల్లా సబ్‌డివిజన్)ల్లో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లు ఓపెన్ చేసిందని పేర్కొన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు.


