News June 26, 2024

రష్యా-ఉక్రెయిన్ మధ్య 180మంది యుద్ధఖైదీల మార్పిడి

image

రష్యా, ఉక్రెయిన్ తాజాగా 180మంది యుద్ధఖైదీలను మార్చుకున్నాయి. తొలుత ఈ మార్పిడి గురించి ఇరు దేశాల అధికారులు మంగళవారం చర్చలు జరిపారు. అంగీకారం కుదరడంతో ఉక్రెయిన్ తమ వద్దనున్న 90మంది ఖైదీలను రష్యాకు అప్పగించింది. అటు రష్యా కూడా ఉక్రెయిన్ యుద్ధఖైదీలను ఆ దేశానికి పంపించింది. చివరిగా ఈ ఏడాది జనవరి 3న 400మంది ఖైదీలను ఇరుదేశాలు మార్చుకున్నాయి.

Similar News

News January 26, 2026

ప్రెగ్నెన్సీలో నిద్రపట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి

image

నెలలు నిండే కొద్దీ గర్భిణుల్లో నిద్రలేమి పెరుగుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు చెబుతున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో డాక్టర్లు చెబితే తప్ప పూర్తి విశ్రాంతి తీసుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. గ్యాడ్జెట్స్​కు దూరంగా ఉండాలి. నిద్రకు ముందు లైట్‌గా కాళ్లు, చేతులు, తల మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

News January 26, 2026

అమెరికా సీక్రెట్ వెపన్ పేరు చెప్పిన ట్రంప్‌

image

వెనిజులా అధ్యక్షుడు మదురోను పట్టుకునే ఆపరేషన్‌లో ‘డిస్కాంబోబులేటర్’ అనే సీక్రెట్ వెపన్ ఉపయోగించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రత్యర్థి సైనిక పరికరాలు పూర్తిగా పనిచేయకుండా చేశామని, వారి వద్ద రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కటి కూడా తమపై ప్రయోగించలేకపోయారని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా చేసే వారిపై దాడులు మరింత విస్తరిస్తామని, అవసరమైతే మెక్సికో వరకూ చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.

News January 26, 2026

వాడిపోయిన తులసి మొక్కను ఏం చేయాలంటే?

image

ఎండిపోయిన తులసి మొక్క పట్ల నిర్లక్ష్యం తగదు. దాన్ని ఎలా పడితే అలా పారవేయకూడదు. పవిత్రంగా స్నానం చేసి, విష్ణువును ధ్యానిస్తూ తొలగించాలి. పవిత్రమైన చోట పాతిపెట్టాలి. పారే నదిలో నిమజ్జనం చేసినా మంచిదే. ఈ ప్రక్రియను గురువారం, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో చేయడం మంచిది. రోడ్ల పక్కన, చెత్తలో వేస్తే ప్రతికూలత పెరుగుతుంది. నియమబద్ధంగా తొలగిస్తే తెలియక చేసిన దోషాలు తొలగి, భగవంతుని కృప లభిస్తుంది.