News June 13, 2024

ఉత్కంఠ.. కాసేపట్లో మంత్రులకు శాఖలు!

image

AP: మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మంత్రుల శాఖలను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ శాఖలపై జోరుగా చర్చ జరుగుతోంది. వీటన్నింటికి కాసేపట్లో తెరపడనుంది.

Similar News

News September 12, 2025

‘TG 09 G9999’కు రూ.25.50 లక్షలు

image

TG: సెంటిమెంట్ కోసం కొందరు వాహనం కంటే రిజిస్ట్రేషన్ నంబర్‌కు అధికంగా వెచ్చిస్తుంటారు. HYD సెంట్రల్ జోన్ RTA ఇవాళ నిర్వహించిన వేలంలో TG09G9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25.50 లక్షలు పలికింది. పలు కార్పొరేట్ కంపెనీలు, సోలో బయ్యర్స్ పాల్గొనగా Hetero డ్రగ్స్ లిమిటెడ్ భారీ ధరకు ఈ నంబర్‌ను దక్కించుకుంది. ఇతర నంబర్లు రూ.1.01-6.25 లక్షల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఒక్క రోజే రూ.63.7 లక్షల ఆదాయం వచ్చింది.

News September 12, 2025

RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి: శ్రీహరి

image

AP: గుంటూరు(D) తురకపాలెంలో AP మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ శ్రీహరి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు పర్యటించారు. ‘చికిత్స కోసం వైద్య శిబిరానికి వచ్చే వారి సంఖ్య తగ్గింది. పరిస్థితి అదుపులోనే ఉంది. స్థానిక RMP అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చాడు. RMPలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం’ అని శ్రీహరి హెచ్చరించారు. తురకపాలెంలో ఇటీవల వరుస మరణాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

News September 12, 2025

రేపు గ్రూప్-2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను TGPSC ప్రకటించింది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి HYD నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని తెలిపింది. అభ్యర్థులు హాజరయ్యాక ఇంకా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉంటే ఈనెల 15న సమర్పించొచ్చని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో చూడొచ్చు.