News January 7, 2025
ACB యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ

TG: కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ACB యాక్షన్ ప్లాన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న విచారణకు రావాలని ఆయనకు నోటీసులిచ్చింది. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో అప్పటి వరకు ఆగుతుందా? ముందే చర్యలకు దిగుతుందా? అనేది చర్చనీయాంశమైంది. దీనిపై న్యాయనిపుణులతో ACB చర్చిస్తోంది. ఇవాళ కోర్టు తీర్పు ఇస్తుందని విచారణకు రాలేనని KTR ఏసీబీకి చెప్పగా, అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2025
మొత్తానికి ట్రంప్‌కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్‌కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.
News November 6, 2025
MOILలో 99 ఉద్యోగాలు

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(<
News November 6, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. రూ.50 కోట్లు దాటిన కలెక్షన్లు!

బాహుబలి-ది ఎపిక్ సినిమా కలెక్షన్లు రూ.50 కోట్లు దాటినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. 6 రోజుల్లో దాదాపు రూ.53 కోట్ల వరకు గ్రాస్ వచ్చినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లకు పైగా, కర్ణాటకలో రూ.5 కోట్లు, విదేశాల్లో రూ.12 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.


