News April 2, 2025
ట్రంప్ టారిఫ్స్ ప్రకటనపై ఉత్కంఠ.. ఎప్పుడంటే?

US ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ అర్ధరాత్రి 1.30గం.లకు(భారత కాలమానం ప్రకారం) దిగుమతులపై టారిఫ్స్ ప్రకటించనున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్స్ పెరిగితే అమెరికన్ కంపెనీలు ఆ భారాన్ని ఎగుమతిదారులపై వేస్తాయి. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే వైట్‌హౌజ్ మీడియా సెక్రటరీ కరోలిన్ భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News April 6, 2025
ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొదటి విడతలో మండలానికి ఓ గ్రామం నుంచి మొత్తం 71 వేల మందిని ఎంపిక చేసింది. ఇప్పుడు మిగతా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు అర్హులను ఎంపిక చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం 4.50 లక్షల మందితో జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జూన్‌లోగా తొలి విడత డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News April 6, 2025
నేడు వైన్ షాపులు బంద్

TG: శ్రీరామనవమి సందర్భంగా నేడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని వైన్ షాపులు మూతబడనున్నాయి. ఉ.10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు ఉత్తర్వులు జారీ చేశారు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఆదేశించారు. స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపునిచ్చారు. అటు జిల్లాల్లో వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.
News April 6, 2025
ALERT: మరో 5 రోజులు వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. నేడు ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA ఓ ప్రకటనలో అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.