News March 25, 2024
ఉత్కంఠ పోరు.. RCB గెలుపు

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన PBKS 20 ఓవర్లలో 176/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన RCBలో విరాట్ కోహ్లీ(77) ఒంటరి పోరాటం చేశారు. చివర్లో లామ్రర్(17*), కార్తీక్(10 బంతుల్లో 28*) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. PBKS బౌలర్లలో రబడ, బ్రార్ చెరో 2 వికెట్లు తీయగా.. కర్రన్, హర్షల్ తలో వికెట్ తీశారు.
Similar News
News October 16, 2025
నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి: APSDMA

AP: దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించాయని APSDMA తెలిపింది. దేశంలోకి మే 24న, రాష్ట్రంలోకి మే 26న ఈ రుతుపవనాలు ప్రవేశించినట్లు వివరించింది. అటు ఇవాళ దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఇవాళ ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News October 16, 2025
డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.
News October 16, 2025
పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.