News August 17, 2024

చిరంజీవి, బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే న్యూస్

image

టాలీవుడ్ లెజండరీ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ త్వరలో ఒకే వేదికను పంచుకోనున్నారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణను చిత్ర పరిశ్రమ తరఫున SEP 1న HYDలో ఘనంగా సన్మానించనున్నారు. ఈ వేడుకకు రావాలని మెగాస్టార్ చిరంజీవికి నిర్వాహకులు ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని చిరు వారితో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే వేదికపై టాప్ హీరోలను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Similar News

News January 8, 2026

ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

image

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.

News January 8, 2026

ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

image

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్‌కు ఎంపిక చేయకుండా ఫూలిష్‌గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.

News January 8, 2026

రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

image

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్‌తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.