News August 6, 2024
JIO యూజర్లకు అదిరిపోయే న్యూస్

గౌతం అదానీతో పాటు మరికొందరు టాప్ బిజినెస్మెన్ టెలికాం సర్వీసెస్లోకి అడుగుపెడతారనే వార్తల నేపథ్యంలో జియో తన యూజర్ల కోసం కొన్ని పాత రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింది. ₹299(28 రోజులు, 1.5GB, మొత్తం 42GB), ₹249(28 రోజులు, 1GB, మొత్తం 28GB), ₹209(22 రోజులు, 1GB, మొత్తం 22GB), ₹199(18 రోజులు, 1.5GB, మొత్తం 27GB). అన్ని ప్లాన్లలోనూ జీయో ఎంటర్టైన్మెంట్ సర్వీస్ లభిస్తుంది.
Similar News
News November 9, 2025
APPLY NOW: NPCILలో 122 పోస్టులు

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 122 Dy మేనేజర్, Jr ట్రాన్స్లేటర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, PG, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు NOV 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్సైట్: https://npcilcareers.co.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 9, 2025
NTPCలో ఇంజినీర్ పోస్టులు

NTPC లిమిటెడ్ 4 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. జియాలజీ, జియో ఫిజిక్స్ విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.50,000-రూ.1,60,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://careers.ntpc.co.in
News November 9, 2025
జెమీమా, షెఫాలీ.. భారీగా పెరిగిన బ్రాండ్ వాల్యూ

ఉమెన్స్ ODIWC విజయం తర్వాత జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ 2-3 రెట్లు పెరిగినట్లు కార్పొరేట్ వర్గాలు చెబుతున్నాయి. ‘జెమీమా ₹60 లక్షల నుంచి ₹1.5 కోట్లు, షెఫాలీ ₹40 లక్షల నుంచి ₹కోటి కేటగిరీకి చేరారు. మిగతా ప్లేయర్లకూ 25-55% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. లైఫ్ స్టైల్, బ్యూటీ, పర్సనల్ కేర్, విద్యాసంస్థలు, ఆటోమొబైల్, బ్యాంకులు వారితో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి’ అని పేర్కొన్నాయి.


