News April 14, 2025
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్

‘WAR-2’ సినిమాలో Jr.NTR 10-20 నిమిషాల పాటు షర్ట్ లెస్‌గా కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. NTR ఇంట్రడక్షన్ సీన్లో భారీ ఫైట్ ఉంటుందని, ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. హృతిక్, NTR కలిసి నటిస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. కాగా గతంలో టెంపర్, అరవింద సమేతలో NTR సిక్స్ ప్యాక్‌తో కనిపించారు.
Similar News
News April 15, 2025
రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

TG: గచ్చిబౌలి పీఎస్‌లో 2016లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని CM రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. గోపన్‌పల్లిలోని భూవివాదానికి సంబంధించి రేవంత్‌పై కేసు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసును కొట్టేయాలంటూ 2020లో రేవంత్ పిటిషన్ వేశారు. ఇవాళ విచారణ సందర్భంగా పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ కె.లక్ష్మణ్ ఆదేశించారు.
News April 15, 2025
ప్రతీకార రాజకీయాలకు ఇది నిదర్శనం: కాంగ్రెస్

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో ఈడీ <<16108914>>చేర్చడంపై<<>> కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు, బెదిరింపులకు ఇది నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. దీనిపై తమ పార్టీ మౌనంగా ఉండదని, సత్యమేవ జయతే అంటూ Xలో ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం చట్టబద్ధమైన పాలన ముసుగులో చేస్తున్న రాజకీయమని రమేశ్ మండిపడ్డారు.
News April 15, 2025
కొత్త సినిమా కలెక్షన్ల సునామీ

అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ తమిళనాడులో రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సంభవం కొనసాగుతోందని పేర్కొంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించారు. అజిత్ కెరీర్లో తమిళనాడులో తొలి రోజే అత్యధిక ఓపెనింగ్స్(రూ.30కోట్లు+) రాబట్టిన చిత్రంగానూ నిలిచింది.