News July 12, 2024

రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్

image

AP, TGలో నడిచే 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా <>జనరల్ బోగీలు<<>> పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, ఫలక్‌నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ, విశాఖ, కొండవీడు, భాగ్యనగర్-కాకినాడ, కాకినాడ-షిర్డీ, కాకినాడ-LTT రైళ్లకు 2 అదనపు జనరల్ బోగీలు, మచిలీపట్నం-ధర్మవరం రైలుకు ఒక బోగీని యాడ్ చేస్తున్నామంది. ఈ రైళ్లలో ఇప్పటికే 2 జనరల్ బోగీలు ఉండగా.. నవంబర్ నుంచి 4 కోచ్‌లతో ఇవి నడుస్తాయి.

Similar News

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

image

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

News December 1, 2025

ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

image

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.