News August 29, 2024
రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్?

వినాయక చవితి (సెప్టెంబర్ 7) రోజున ‘గేమ్ ఛేంజర్’ నుంచి బిగ్ సర్ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు ఈ మూవీ నుంచి ఓ పాట లేదా గ్లింప్స్ విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కుతోంది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 5, 2026
సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.
News January 5, 2026
J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్‌లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.
News January 5, 2026
IPL ప్రసారంపై బ్యాన్.. బంగ్లా సంచలన నిర్ణయం

భారత్‌తో వైరం ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో IPL ప్రసారంపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ బ్యాన్ అమలు చేయాలని బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంలో KKR టీమ్ నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తీసేయడంతో<<>> ఈ వివాదం చెలరేగింది. తాము T20 WC కోసం భారత్‌కు రాబోమని ICCకి BCB <<18761652>>లేఖ<<>> రాసింది. ఈక్రమంలోనే IPL ప్రసారంపై బ్యాన్ విధించింది.


