News November 12, 2024
జాబితాలో తమ కులం లేదని సర్వే బహిష్కరణ

TG: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జాబితాలో తమ కులం పేరు లేదని కామారెడ్డి(D) పెద్దకొడప్‌గల్ మండలంలో మధుర లంబాడా కుటుంబాలు సర్వేను బహిష్కరించాయి. జాబితాలో 240 కులాలుంటే తమ కులం పేరును మధుర అని పేర్కొన్నారని వారు అంటున్నారు. తాము సర్వేలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పారు. దీంతో దాదాపు 2వేల కుటుంబాలకు సంబంధించిన సర్వే నిలిచిపోయింది.
Similar News
News December 11, 2025
రావణుడు లంకకు మొదటి నుంచే రాజా?

లంకకు అసలు రాజు, పుష్పక విమానానికి యజమాని ‘కుబేరుడు’. ఆయన విశ్రవసుడు, ఇళవిడ కుమారుడు. అయితే విశ్రవసుడు, ఆయన రెండో భార్య కైకసిలకు రావణుడు జన్మించాడు. రావణుడు కఠోర తపస్సు చేసి అపారమైన శక్తులు, వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో కుబేరుడిని బెదిరించి, లంకా రాజ్యాన్ని, పుష్పక విమానాన్ని లాక్కున్నాడు. ఇలా లంకాధిపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆయన మొదటి నుంచే లంకకు రాజు కాదు.
News December 11, 2025
జైలులో హీరో.. కానీ అభిమానుల సంబరాలు

అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు <<18513197>>దర్శన్<<>> సినిమా ‘ది డెవిల్’ రేపు విడుదల కానుంది. దీంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. మరోవైపు శివరాజ్‌కుమార్, రిషబ్ శెట్టి వంటి పెద్ద స్టార్‌లు కూడా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తుండటం గమనార్హం. హత్యారోపణలు ఎదుర్కొంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న నటుడి సినిమాకు సెలబ్రేషన్స్ నిర్వహించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
News December 11, 2025
CIBC ప్రెసిడెంట్‌తో లోకేశ్ భేటీ

AP: కెనడా- ఇండియా బిజినెస్ కౌన్సిల్(CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీనికి విక్టర్ సానుకూలంగా స్పందించారు. పారిశ్రామికాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.


