News December 3, 2024

EXCLUSIVE: ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS

image

AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.

Similar News

News March 5, 2026

డ్యూటీ ముగిసిందని వెళ్లిపోయిన లోకో పైలట్.. 3 గంటలు చుక్కలు!

image

తన పని గంటలు ముగిశాయంటూ ట్రైన్‌ను ప్లాట్‌ఫామ్‌పై నిలిపేశారో లోకో పైలట్. దీంతో వందలాది ప్రయాణికులు 3 గంటలపాటు ఇక్కట్లు పడ్డారు. బిహార్‌లోని కిషన్ గంజ్(D) ఠాకూర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. మాల్డా-సిలిగురి రైలు నిన్న మధ్యాహ్నం ఠాకూర్‌గంజ్ చేరుకుంది. రూల్ ప్రకారం తన 9 గం. షిఫ్ట్ అయిపోయిందని అధికారులకు చెప్పి, రైలు నడిపేందుకు లోకో పైలట్ నిరాకరించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారని సమాచారం.

News March 5, 2026

FLASH: మళ్లీ తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర మరోసారి తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఉదయం నుంచి రూ.1,630 తగ్గి రూ.1,62,880కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,500 పతనమై రూ. 1,49,300 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరల్లో కాస్త మార్పులుండొచ్చు.

News March 5, 2026

ఎక్కువ చదివినవారిలోనే నిరుద్యోగులు అధికం!

image

ఇండియాలో చదువు పెరిగే కొద్దీ నిరుద్యోగం కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ నిరుద్యోగ సగటు 3.2% ఉంటే డిగ్రీ చదివిన వారిలో ఇది 13%గా ఉంది. దీనిని ‘ఎడ్యుకేషన్ పారడాక్స్’ అంటారు. తక్కువ చదువుకున్న వారు ఏదో ఒక చిన్న పనిలో త్వరగా చేరుతుండగా.. పట్టభద్రులకు వారి స్థాయికి తగ్గ ఉద్యోగాలు దొరకట్లేదు. డిగ్రీలున్నా నైపుణ్యాలు లేకపోవడం& ఉద్యోగాల కొరతే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.