News September 19, 2025

EXCLUSIVE: త్వరలో గ్రూప్-2 ఫైనల్ లిస్టు!

image

TG: దసరాలోగా గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైనవారి లిస్టు విడుదల కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తం 783 పోస్టులకు ఈనెల 13న సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విషయం తెలిసిందే. గ్రూప్-1 నోటిఫికేషన్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురైన కారణంగా ముందుగా గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పండగకు ముందే తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

Similar News

News September 20, 2025

H1Bలపై ట్రంప్ షాక్.. ఉద్యోగాలు కష్టమే!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల ఫీజును <<17767574>>లక్ష డాలర్లకు<<>> పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలుండదు.

News September 20, 2025

మైథాలజీ క్విజ్ – 11

image

1. రామాయణంలో తాటకి భర్త ఎవరు?
2. మహాభారతంలో శంతనుడి మొదటి భార్య ఎవరు?
3. సరస్వతీ దేవి వాహనం ఏంటి?
4. పశుపతినాథ్ దేవాలయం ఏ దేశంలో ఉంది?
5. దీపావళి సందర్భంగా ఏ దేవతను పూజిస్తారు?
<<-se>>#mythologyquiz<<>>

News September 20, 2025

వీటిని ఎక్కువ రోజులు వాడుతున్నారా?

image

మనం రోజూ వాడే వస్తువులను నిర్దిష్ట సమయంలో మార్చేయాలనే విషయం మీకు తెలుసా? టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడకుండా 3 నెలలకోసారి మార్చడం మేలని నిపుణులు చెబుతున్నారు. అలాగే లోదుస్తులను 6-12 నెలలకు ఓసారి, చీపురుని 1-2 ఏళ్లకోసారి, పరుపుని 7-10ఏళ్లకు ఒకసారి మార్చాలట. దిండును రెండేళ్లకు, సన్‌స్క్రీన్ 12 నెలలకు, కిచెన్ స్పాంజ్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు. SHARE IT