News April 24, 2024
మీ క్షమాపణ.. యాడ్ సైజ్‌లోనే ఉందా? పతంజలిపై సుప్రీం ఫైర్

తప్పుడు ప్రకటనల కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడిన పతంజలిపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. బాబా రాందేవ్, బాలకృష్ణ తరఫున వాదించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ‘కోర్టును క్షమాపణ కోరుతూ పతంజలి రూ.10లక్షల ఖర్చుతో 67 న్యూస్ పేపర్లలో ప్రకటన ఇచ్చింది’ అని కోర్టుకు తెలిపారు. దీంతో ‘మీరిచ్చిన యాడ్స్ సైజ్, ఫాంట్ తరహాలోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా?’ అని SC ప్రశ్నించింది. తదుపరి విచారణను 30కి వాయిదా వేసింది.
Similar News
News December 10, 2025
ఉచిత ఇసుక పారదర్శకతకు కృషి: కలెక్టర్

ఉచిత ఇసుకను పారదర్శకంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 4రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా ఇసుక తీసేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపారు. ఈ రీచ్‌లలో మర్లపాలెం, కపిలేశ్వరం, జొన్నాడ, ఆలమూరు రీచ్‌లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు.
News December 10, 2025
ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 10, 2025
పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.


