News July 10, 2024

వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయండి: WHO

image

వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా సూచించింది. 300 నిమిషాల వరకు ఎక్స‌ర్‌సైజులకు కేటాయించాలని పేర్కొంది. ఐదేళ్ల వయసు మొదలు అన్ని రకాల వయసుల వారికి పలు సిఫారసులను చేసింది. తగినంత వ్యాయామం చేయనివారిలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. ప్రధానంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వివరించింది.

Similar News

News November 27, 2025

రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పబ్లిక్ టాక్

image

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ప్రీమియర్లు USAలో మొదలయ్యాయి. RA-PO వన్ మ్యాన్ షో చేశాడని, చాలారోజుల తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడిందని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కుదిరిందంటున్నారు. స్క్రీన్‌ప్లే బాగుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. కొన్నిసీన్లు అసందర్భంగా వస్తాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.

News November 27, 2025

MTU 1232.. ముంపు ప్రాంత రైతులకు వరం

image

MTU 1075, స్వర్ణ రకాలతో సంకరణం చేసి MTU 1232ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. నాట్లు వేశాక 14-15 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు. పంటకాలం సాధారణంగా 135-140 రోజులు, ముంపునకు గురైతే 140-145 రోజులు. మొక్క ఎత్తు 120 సెం.మీ. అగ్గి తెగులు, దోమపోటు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది సాధారణ భూమిలో ఎకరాకు 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడినిస్తుంది.

News November 27, 2025

డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

image

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.