News September 27, 2024

ఏటీసీల్లో ఉద్యోగాల భర్తీకి కసరత్తు

image

TG: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అందులో దాదాపు 40శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 65 ఏటీసీల్లో వివిధ విభాగాల్లో 2,033 ఉద్యోగాలు మంజూరు కాగా దాదాపు 1,500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయో గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

Similar News

News October 24, 2025

IGMCRIలో 226 నర్సు పోస్టులు

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. <>వెబ్‌సైట్<<>>: https://igmcri.edu.in/

News October 24, 2025

బస్సు ప్రమాదం: తెలంగాణ ప్రభుత్వం పరిహారం

image

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది. <<18088909>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.

News October 24, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారించే ఆహారాలివే..

image

ప్రస్తుతకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలిని పాటించడం వల్ల క్యాన్సర్ తీవ్రతను తగ్గించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే దానిమ్మ, సోయా ఉత్పత్తులు, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉసిరికాయ, పియర్, అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. అలాగే ఆలివ్ ఆయిల్‌లో ఉండే పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి.