News September 23, 2024
ఆయుష్మాన్ స్కీమ్ అమలుకు కసరత్తు

TG: డెబ్బై ఏళ్లు పైబడిన వారిని సైతం ఆయుష్మాన్ భారత్ కింద చేర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు 5లక్షల మంది ఉన్నట్లు వైద్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. వీరందరికీ ఆయుష్మాన్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీని కింద దేశవ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనైనా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు.
Similar News
News December 11, 2025
గజ్వేల్: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

గజ్వేల్ మండలంలో 3 గ్రామాల పోలింగ్ స్టేషన్లు జాలిగామా గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సింగాటం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీగిరిపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News December 11, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.4,085 కోట్లు చెల్లింపు

AP: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతేడాది కంటే ఈ ఏడాది 32% అదనంగా ధాన్యం సేకరించి, 24 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.
News December 11, 2025
ప్రభుత్వం మారినా బంగ్లాలో మార్పులేదు!

బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారినా అమాయకుల హత్యలు, చిత్రహింసలు మాత్రం ఆగలేదని మానవహక్కుల సంస్థలు వెల్లడించాయి.<<18161586>> షేక్ హసీనా<<>> దేశం నుంచి వెళ్లిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని చాలామంది భావించారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలోనూ ఆ కల నెరవేరలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 37 ఎన్కౌంటర్లు జరగగా, 95 మంది కస్టడీలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.


