News August 1, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్లపై కసరత్తు

image

AP: మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రంలో 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండగా, అందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ ఉంటే పథకం అందదని తెలుస్తోంది. కరెంట్ బిల్స్, ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అర్హులను గుర్తిస్తారని సమాచారం.

Similar News

News October 24, 2025

చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

image

TG: ఆర్‌అండ్‌బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్‌తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.

News October 24, 2025

మళ్లీ అదే సిడ్నీ.. కోహ్లీ రేపు ఏం చేస్తారో?

image

రేపు ఆస్ట్రేలియాతో 3వ వన్డే జరిగే సిడ్నీ వేదిక విరాట్ కోహ్లీ అభిమానులను కలవరపెడుతోంది. 10 నెలల క్రితం ఆయన ఇదే స్టేడియంలో చివరి టెస్ట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనేదే ఫ్యాన్స్ ఆందోళన. తొలి 2 మ్యాచుల్లో డకౌట్, 2వ వన్డే‌లో అభిమానులకు కోహ్లీ <<18081069>>అభివాదం<<>> చేయడం మరింత కలవరపెడుతున్నాయి. దీంతో రేపు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మీరేమంటారు?

News October 24, 2025

సూపర్ ఫిట్‌గా శర్వానంద్

image

టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త లుక్‌లో అదరగొడుతున్నారు. సన్నగా మారిపోయి, సడన్‌గా చూస్తే గుర్తుపట్టలేనంతగా ట్రాన్స్‌ఫామ్ అయ్యారు. శర్వానంద్ ప్రస్తుతం ‘బైకర్’ అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీలో నటిస్తుండగా, సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న ఆయన సూపర్ ఫిట్‌గా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. శర్వానంద్ కొత్త లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.