News October 23, 2024

మధ్యాహ్న భోజనం మెనూ మార్పుపై కసరత్తు

image

AP: పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. కొన్ని రకాల వంటకాలను పిల్లలు తినడం లేదని అందిన ఫీడ్ బ్యాక్ మేరకు చర్యలు చేపట్టింది. వంటలు చేసే ఏజెన్సీలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనుంది. జిల్లాల వారీగా మెనూని తీసుకురావాలా? లేదా ప్రాంతీయ, రాష్ట్ర స్థాయిలో మెనూని అమలు చేయాలా? అనే దానిపై కసరత్తు చేస్తోంది.

Similar News

News December 12, 2025

సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదు: కోమటిరెడ్డి

image

TG: కుటుంబాలతో కలిసి సినిమాలు చూడాలంటే టికెట్ ధరలు తక్కువుండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ‘మూవీ టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాతలు, దర్శకులు మా దగ్గరికి రావొద్దు. టికెట్ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నాం. ఈసారి పొరపాటు జరిగింది. హీరోలకు రూ.వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారు’ అని ప్రశ్నించారు. అఖండ-2 ప్రీమియర్స్ రేట్లు పెంపు జీవోని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.

News December 12, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు.. కారణం ఏమిటి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News December 12, 2025

భారత్ భారీ స్కోర్

image

మెన్స్ U-19 ఆసియా కప్-2025లో భారత జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. UAEతో మ్యాచులో 50 ఓవర్లలో 433-6 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 171 రన్స్‌తో ఊచకోత కోశారు. ఆరోన్ జార్జ్ 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులతో అదరగొట్టారు.