News March 22, 2025

మూడో దఫా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

image

AP: రాష్ట్రంలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లు, 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు 2-3 పేర్లు పరిశీలిస్తున్నారని, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.

Similar News

News March 23, 2025

టాస్ గెలిచిన CSK

image

IPL-2025: చెన్నై వేదికగా ఇవాళ MI, CSK జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.

News March 23, 2025

రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్

image

TG: రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ APR నుంచి 6KGల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. ఈ నెల 30న హుజూర్‌నగర్‌లో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామన్నారు.

News March 23, 2025

విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

image

AP: విశాఖ మేయర్‌పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు)కి చేరింది.

error: Content is protected !!