News October 2, 2024
సంయమనం పాటించండి: పశ్చిమాసియాకు భారత్ సూచన

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత్ స్పందించింది. చేజారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని దేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు మరింత ఉగ్రరూపం దాల్చకూడదని అభిప్రాయపడింది. సమస్యల్ని చర్చలు, దౌత్య విధానాల్లో పరిష్కరించుకోవాలని సూచించింది. హెజ్బొల్లా చీఫ్ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పైకి ఇరాన్ నిన్న 200 క్షిపణుల్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 10, 2025
మొదట గూగుల్.. ఇప్పుడు మెటా: లోకేశ్

AP: మెటా సంస్థ తన సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ‘వాటర్ వర్త్’ను వైజాగ్‌కు తీసుకురావాలని భావిస్తోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. Economic Timesలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. ఇండియాలో AI నగరంగా, డేటా సిటీగా విశాఖను ఇది మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తుందని పేర్కొన్నారు. తొలుత గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు మెటా అంటూ ఆయన పోస్టు పెట్టారు.
News October 10, 2025
మోదీ కోసం కీలక మీటింగ్‌ను మధ్యలోనే ఆపేసిన నెతన్యాహు

ఇజ్రాయెల్ PM నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే సీజ్ఫైర్, బందీల విడుదల ఒప్పందంపై నెతన్యాహు కీలకమైన సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఈ కాల్ వచ్చినట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని కొద్ది సేపు నిలిపేసి మోదీతో మాట్లాడారని ఇజ్రాయెల్ పీఎం ఆఫీసు వెల్లడించింది. బందీల విడుదల కోసం కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని చెప్పింది.
News October 10, 2025
ఘరానా మోసం.. రూ.18 కోట్లు వసూలు చేసిన కిలేడి

సంగారెడ్డి(D) పటాన్చెరులో ఘరానా మోసానికి పాల్పడిందో కిలేడి. కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు వస్తోందని, కంటైనర్లను కొనడానికి డబ్బు అవసరమని విద్య పలువురి వద్ద కోట్లు వసూలు చేసింది. రూ.35 వేలకే తులం బంగారం ఇస్తానని మరికొందరి నుంచి డబ్బు తీసుకుంది. ఇలా మొత్తంగా రూ.18 కోట్లు దండుకుంది. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులను అనుచరులతో కొట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.