News October 28, 2024

పవన్ కళ్యాణ్ ఆఫీసులో లేపాక్షి బొమ్మల ఎగ్జిబిషన్ స్టాల్

image

AP: లేపాక్షి బొమ్మలపై ఇష్టంతో డిప్యూటీ సీఎం పవన్ తన క్యాంప్ కార్యాలయంలో లేపాక్షి బొమ్మల శాశ్వత ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయించారు. వీటితో పాటు సవర తెగకు చెందిన గిరిజనులు ఎంతో ఇష్టంతో పంపించిన బహుమతులను అందుకుని ఆయన సంతోషించారని Dy.CM కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే తన పుట్టినరోజు సమయంలో వారు చేసిన కార్యక్రమాలు, వేడుకలను గురించి తెలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారని ఫొటోలు పోస్ట్ చేసింది.

Similar News

News March 17, 2026

KKRకు గాయాల ‘దెబ్బ’

image

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్‌ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.

News March 17, 2026

ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

image

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.

News March 17, 2026

11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/