News June 2, 2024
EXIT POLLS: ఉమ్మడి నెల్లూరులో బిగ్ ఫైట్ !

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టప్ ఫైట్ నెలకొందని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో కూటమి 2సీట్లు, వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఆరు చోట్ల టఫ్ పైట్ ఉందని పేర్కొంది. అందులో రెండు చోట్ల టీడీపీ, మూడు చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలిపింది. మరో స్థానంలో రెండు పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడిచినట్లు వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.
Similar News
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.
News October 29, 2025
నెల్లూరులో Photo Of The Day

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


