News June 2, 2024
EXIT POLLS: ఉమ్మడి విశాఖలో ఎన్డీఏ కూటమికే పట్టం.!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 15 స్థానాల్లో కూటమి 5 సీట్లు గెలుస్తుందని, 6 చోట్ల ఎడ్జ్ ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీకి ఒక సీటు వస్తుందని చెప్పింది. మిగతా మూడు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేసింది. ఈ సర్వేపై మీ COMMENT.
Similar News
News November 27, 2025
విశాఖ: అవినీతి పోలీసుల వేటకు రంగం సిద్ధం?

విశాఖలోని పోలీస్ శాఖలో అవినీతిపై సీరియస్ అయిన CP శంఖబ్రత బాగ్చీ భారీగా బదిలీలు చేపట్టారు. ఇటీవల నలుగురు SIలను బదిలీ చేసిన ఆయన, నేడు మరో 37 మంది ASIలు, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుళ్లను ఒకేసారి బదిలీ చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది అవినీతి, నెల మామూలు వసూళ్లు, నేరస్తులకు సమాచారం చేరవేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో సీఐలపై కూడా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
News November 27, 2025
విశాఖ: వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ను గురువారం వేశారు. జీవీఎంసీ పరిధిలో 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బందికి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి వ్యాక్సిన్ వేశారు. వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు,శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
News November 27, 2025
విశాఖ: రూ.1,12,03,480 ప్రాపర్టీ రికవరీ

విశాఖ సీపీ కార్యాలయంలో గురువారం ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. అక్టోబర్ నెలలో జరిగిన రికవరీ మేళాలో విశాఖ కమీషనరేట్ పరిధిలో నమోదైన కేసులను పోలీసులు చేధించి రూ.1,12,03,480 సొత్తును రికవరీ చేశారు. ఆ ప్రాపర్టీను సీపీ శంఖబ్రత బాగ్చి బాధితులకు అందించారు. మొత్తం 838.331 గ్రాముల బంగారం, 505 మొబైల్ ఫోన్స్, 22 ద్విచక్ర వాహనాలు, రూ.3,10,500 రికవరీ చేశారు. విశాఖ సీపీ ప్రతి నెల ఈ మేళా నిర్వస్తున్నారు.


