News June 2, 2024

EXIT POLLS: కడపలో వైసీపీకే పట్టం.!

image

ఉమ్మడి కడప జిల్లాలో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 6 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఇదే క్రమంలో కూటమికి రెండు సీట్లు వస్తాయని, మరో రెండు చోట్ల రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. ఈ సర్వేపై మీ COMMENT.

Similar News

News September 9, 2024

కడప: ‘మా ఊరి సినిమా’ హీరో మహేశ్ ఇంట్లో భారీ చోరీ

image

పులివెందులలోని ‘మా ఊరి సినిమా’ చిత్ర హీరో మహేశ్ ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పులివెందులలోని షాదీ ఖానా వెనక భాగంలో మహేశ్ నివసిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న నగదు, బంగారు నగలను దోచుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 9, 2024

కడప జిల్లా వ్యాప్తంగా వర్షపాత వివరాలు

image

అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షపాతం వివరాలను అధికారులు తెలిపారు. లింగాల మండలంలో అత్యధికంగా 30.2 మి.మీ వర్షం నమోదయినట్లు చెప్పారు. కొండాపురం మండలంలో 1.2 మి.మీ, పులివెందుల 26, వేముల 15, చక్రాయపేట 4, సింహాద్రిపురం 4.4, వేంపల్లిలో 5.4, మైదుకూరు 3.8, ఖాజీపేట 2.8, చాపాడు 2.4, తొండూరు 2.0, సిద్దవటం 1.8, దువ్వూరు 1.6, బద్వేల్, అట్లూరు 1.4, బీ.కోడూరు 1.0, బీ.మఠం మండలంలో 1.2 మి.మీ వర్షం కురిసిందన్నారు.

News September 9, 2024

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: ఎస్పీ

image

కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో నేడు పోలీసులు బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. జిల్లా పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎస్పీ కార్యాలయానికి ఎవరూ రావొద్దని సూచించారు.