News February 11, 2026

EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.

Similar News

News March 26, 2026

ASF: ఇళ్లలో ఇంధనం నిల్వ చేయవద్దు.. ప్రమాదకరం!

image

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇంధన కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కొందరు ఏకంగా ఇళ్లలోనే పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసుకుంటుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా స్వల్ప వేడికి కూడా ఇంధనం నిప్పంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రాణాలను పణంగా పెట్టి నిల్వలు చేయవద్దని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

News March 26, 2026

హార్ముజ్ భారత్‌కు తెరిచే ఉంటుంది: ఇరాన్ విదేశాంగ మంత్రి

image

హార్ముజ్ ఇండియాకు తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని తెలిపింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.

News March 26, 2026

ఆముదాలవలస: నిండు గర్భిణీ ఆత్మహత్య.. బిడ్డను కాపాడిన వైద్యులు

image

ఆముదాలవలసలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (25) అనే నిండు గర్భిణి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపర్ణ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వెనువెంటనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడారు. భర్తతో ఉన్న కలహాలే ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. బిడ్డ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.