News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 3-5 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 2-4 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP 2-3, MIM 1, ఇతరులు ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 11, 2026
నరసరావుపేట: ‘తిరునాళ్లకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి’

త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం నరసరావుపేటలో SP కృష్ణారావుతో కలిసి ఆయన ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ ప్రదేశాలను క్రమబద్ధీకరించాలని, జనసందోహాన్ని నియంత్రించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
News February 11, 2026
గుంటూరులో రైడ్స్.. 8 మంది పురుషులు, మహిళలు అరెస్ట్

గుంటూరు బ్రాడీపేటలోని ఓ రెసిడెన్సీలో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 8 మంది పురుషులు, ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌బీ సీఐ సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అరండల్ పేట పోలీసులకు అప్పగించారు.
News February 11, 2026
విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

AP: విద్యుత్ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లలో 90 శాతానికి పైగా పరిష్కరించామన్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో తెలిపారు. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి సమస్యలుంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.


