News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి నిజామాబాద్‌లో ఇలా..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 5 నుంచి 7 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 1 నుంచి 2 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 11, 2026
GNT: మార్చి 1న ‘ఎన్టీఆర్ స్టేడియం’ ఎన్నికలు

బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ ఎన్నికలను మార్చి 1న నిర్వహించనున్నట్లు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల చేసి, 13న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సహా మొత్తం 8 మంది సభ్యులను ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
News February 11, 2026
గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హోం గార్డులకు ఎస్పీ వకుల్ జిందాల్ నగదు చెక్కులను అందజేశారు. తోటి హోం గార్డులు తమ ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళంగా సేకరించి సమకూర్చిన రూ.2.31 లక్షలు, రూ. 2.21 లక్షల మొత్తాలను వారికి అందజేశారు. ఎస్పీ వారి సుదీర్ఘ సేవలను కొనియాడారు. హోం గార్డుల మధ్య ఉన్న ఐక్యత, తోటివారికి అండగా నిలిచే గుణాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
News February 11, 2026
BREAKING ఆరిలోవలో మహిళ హత్య

విశాఖలోని ఆరిలోవలో ఓ మహిళ బుధవారం హత్యకు గురైంది. స్థానికుల వివరాల మేరకు.. ఆరిలోవ పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా దుర్గా బజార్ సమీపంలోని ఇంట్లో లక్ష్మి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్వరరావు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని సీఐ వెల్లడించారు.


