News February 11, 2026
EXIT POLLS.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 2 నుంచి 4 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక BRS 7 నుంచి 9 మున్సిపాలిటీల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BJP ఒక్క మున్సిపాలిటీ కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
Similar News
News February 12, 2026
పన్నుల వసూల్లో అధికారులు కీలకపాత్ర పోషించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి కీలక కార్యాచరణ అమలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సమకూర్చడంలో అధికారులకు కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాణిజ్య, జీఎస్టీ పన్నులకు సహాయపడేలా ప్రతి శాఖకు వాణిజ్య పన్నుల శాఖ వారు ఒక ఫార్మేట్ రూపొందించాలన్నారు.
News February 12, 2026
HEADLINES

* కూటమి ఐకమత్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: CM CBN
* ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. హాజరైన జగన్
* వైసీపీ మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది: పవన్
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్
* USతో ట్రేడ్ డీల్‌లో మోదీ భరతమాతను తాకట్టు పెట్టారు: రాహుల్ గాంధీ
* రాహుల్ కామెంట్స్‌పై బీజేపీ తీవ్ర అభ్యంతరం
* స్వల్పంగా తగ్గిన బంగారం ధర, స్థిరంగా సిల్వర్ రేట్స్
News February 12, 2026
ఆయిల్ కొనబోమని ఇండియా చెప్పలేదే: రష్యా

తమ నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప ఇంకెవరూ చెప్పలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. ‘ఇలాంటి స్టేట్‌మెంట్ ట్రంప్ ఇవ్వడం తప్ప ప్రధాని మోదీ సహా ఇతర ఇండియన్ మినిస్టర్ల నుంచి నేను వినలేదు’ అని ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకపోతే భారత్‌పై 25% టారిఫ్స్ వేస్తామని ట్రంప్ <<19081934>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.


