News February 11, 2026
Exit polls: రామగుండంలో ఏ పార్టీకి సీట్లంటే..!

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. రామగుండం కార్పొరేషన్(60)లో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా ఫలితాలు ఈనెల 13న వెల్లడి కానున్నాయి.
Similar News
News February 12, 2026
విశాఖలో మహిళ దారుణ హత్య

విశాఖలో ఓ మహిళ బుధవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. GVMCలో పనిచేస్తున్న రమణ భార్య లక్ష్మీతో కలిసి ఆరిలోవ ఉంటున్నాడు. రమణ డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి భార్య నిర్జీవంగా పడి ఉంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వద్ద ఉన్న CC కెమెరాల ఆధారంగా ఫుటేజీ పరిశీలించగా ఓ దుండగుడు ఉ.10 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లినట్లు ఉంది. అతనే లక్ష్మీని చంపేసి బంగారం, నగదు దోచుకెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.
News February 12, 2026
విజయవాడలో గ్యాంగ్ అరెస్ట్.. వీళ్లు మామూలోళ్లు కాదు!

డబ్బు ఆశ చూపి అమాయకులతో బ్యాంక్ ఖాతాలు తెరిపించి, సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. రవికుమార్, స్టీఫెన్, బాజీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుంచి రూ.3.4 లక్షల నగదు, 21 ఫోన్లు, 46 ATM కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ ఖాతాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్నట్లు CP రాజశేఖర్ బాబు వెల్లడించారు.
News February 12, 2026
ప్రకాశం: నిర్మాణాలపై జేసీ సూచనలు

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగే భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో జాప్యం ఉండరాదని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. ఈ సంస్థకు వైస్ ఛైర్మన్‌గా ఉన్న ఆమె బుధవారం సిబ్బందితో ప్రకాశం భవనంలో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్, భవన నిర్మాణ అనుమతులపై జేసీ ఆరా తీశారు.


