News October 5, 2024
Exit Polls: బీజేపీకి ప్రతికూల ఫలితాలు

JK, హరియాణా ఎన్నికల్లో BJPకి ప్రతికూల ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్కర్ 20-25 *గలిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.
Similar News
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<
News November 27, 2025
చలికాలంలో పాదాలు పగులుతున్నాయా?

చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేసి సాక్సులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. డీ హైడ్రేషన్ వల్ల కూడా పాదాలు పగులుతాయి కాబట్టి తగినంత నీరు తాగాలని చెబుతున్నారు.
News November 27, 2025
పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.


