News October 4, 2024

దేశంలో మళ్లీ ఎగ్జిట్ పోల్స్ సందడి

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత మ‌రోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జ‌మ్మూక‌శ్మీర్‌, హ‌రియాణ ఎన్నిక‌లకు సంబంధించి శ‌నివారం సాయంత్రం 6 గంట‌ల త‌రువాత ప‌లు సంస్థ‌లు తమ అంచ‌నాల‌ను వెల్ల‌డించ‌నున్నాయి. ఇప్ప‌టికే JK ఎన్నిక‌లు ముగిశాయి. శ‌నివారం హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల మేర‌కు పోలింగ్ స‌మ‌యం ముగిసిన త‌రువాత ఫ‌లితాల అంచ‌నాలు వెలువ‌డ‌నున్నాయి.

Similar News

News October 7, 2024

జానీ మాస్టర్‌ బెయిల్ రద్దు కోసం కోర్టుకు పోలీసులు!

image

అత్యాచారం కేసు నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేసిన విషయం తెలిసిందే. అంతకుముందు అవార్డు అందుకునేందుకు ఆయనకు రంగారెడ్డి కోర్టు 4 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో జానీ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. దీంతో ఆయనను మళ్లీ రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

News October 7, 2024

అడిగిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించాం: తమిళనాడు మంత్రి

image

చెన్నై ఎయిర్ షోకు కోరిన వాటికన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించినట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వైద్య బృందాలతో పాటు 40 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నిన్న ఈవెంట్‌కు వచ్చిన జనం అవస్థలు పడటంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని BJP రాష్ట్ర చీఫ్ అన్నామలై డిమాండ్ చేశారు.

News October 7, 2024

నేడు విచారణకు నాగార్జున పిటిషన్

image

తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకుల్లో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. శుక్రవారం విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో ఈరోజుకు వాయిదా పడింది. కోర్టు ఎలా స్పందిస్తుందోననే ఆసక్తి నెలకొంది.