News February 5, 2025
Way2Newsలో ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
Similar News
News December 14, 2025
ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మ.2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, సా.5గంటలలోపు ఫలితాలు వచ్చే అవకాశముంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ లైవ్ అప్డేట్స్ వే2న్యూస్లో తెలుసుకోవచ్చు.
News December 14, 2025
బౌండరీల వర్షం.. అదరగొట్టిన జైస్వాల్, సర్ఫరాజ్

SMATలో హరియాణాతో జరిగిన మ్యాచులో ముంబై బ్యాటర్లు అదరగొట్టారు. 235 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ జైస్వాల్ 48 బంతుల్లో సెంచరీ (16 ఫోర్లు, 1 సిక్సు) చేయగా, సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 64 రన్స్(9 ఫోర్లు, 3 సిక్సులు)తో రాణించారు. 3వ ఓవర్లో జైస్వాల్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 6వ ఓవర్లో సర్ఫరాజ్ వరుసగా 6, 0, 4, 4, 4, 4 సాధించారు. 7వ ఓవర్లోనూ 4 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించారు.
News December 14, 2025
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మెగా జాబ్మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆధ్వర్యంలో డిసెంబర్ 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నాయి. 18-35ఏళ్ల మధ్య వయసు కలిగి, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు జాబ్ మేళాలో నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోనున్నాయి.


